ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాత్రిపూట క‌ర్ఫ్యూ పొడిగింపు

  • క‌రోనా విజృంభ‌ణ త‌గ్గ‌క‌పోవ‌డంతో నిర్ణ‌యం
  • ఈ నెల 21వ తేదీ వరకు పొడిగింపు
  • రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ప్యూ
క‌రోనా విజృంభ‌ణ త‌గ్గ‌క‌పోవ‌డంతో ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూను ఈ నెల 21వ తేదీ వరకు పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఈ రోజు ఉద‌యం ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ప్యూ అమల్లో ఉంటుందని తెలిపింది.

కాగా, ఏపీలో కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు అదుపులోకి రావ‌ట్లేదు. దీనిపై నిన్న స‌ర్కారు సమీక్ష స‌మావేశం నిర్వహించి, రాత్రి పూట కర్ఫ్యూ పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. రాత్రి స‌మ‌యంలో క‌రోనా ఆంక్ష‌లు కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టం చేసింది.


More Telugu News