లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ సారథి రూట్ భారీ సెంచరీ
- టీమిండియా, ఇంగ్లండ్ రెండోటెస్టు
- తొలి ఇన్నింగ్స్ లో భారత్ 364 ఆలౌట్
- ఫామ్ కొనసాగించిన రూట్
- సిరీస్ లో రెండో సెంచరీ నమోదు
- ఇంగ్లండ్ 118 ఓవర్లలో 358/8
లార్డ్స్ మైదానంలో టీమిండియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ భారీ సెంచరీ సాధించాడు. నాటింగ్ హామ్ లో జరిగిన తొలి టెస్టులోనూ సెంచరీ నమోదు చేసిన రూట్... లార్డ్స్ లోనూ తన ఫామ్ కొనసాగించాడు. సహచరుల అండతో ఇన్నింగ్స్ ను ముందుకు కొనసాగిస్తూ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 118 ఓవర్లలో 8 వికెట్లకు 358 పరుగులు కాగా, టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు కేవలం 6 పరుగులు వెనుకబడి ఉంది. రూట్ (159 బ్యాటింగ్), మార్క్ ఉడ్ క్రీజులో ఉన్నారు.
ఓవర్ నైట్ స్కోరు 119/3తో మూడో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ జట్టును రూట్, బెయిర్ స్టో జోడీ ఆదుకుంది. బెయిర్ స్టో 57 పరుగులు చేశాడు. జోస్ బట్లర్ 23, మొయిన్ అలీ 27 ఓ మోస్తరుగా రాణించారు. అయితే సిరాజ్, ఇషాంత్ శర్మ కీలక సమయాల్లో వికెట్లు తీసి ఇంగ్లండ్ కు అడ్డుకట్ట వేశారు. టీమిండియా బౌలర్లలో సిరాజ్ కు 4, ఇషాంత్ కు 3 వికెట్లు లభించాయి.
కాగా లార్డ్స్ లో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. విరామ సమయంలో ఓ అభిమాని అచ్చం టీమిండియా ఆటగాళ్లలా జెర్సీ ధరించి మైదానంలోకి అడుగుపెట్టాడు. అతడ్ని చూసి భారత క్రికెటర్లు విస్మయానికి గురయ్యారు. అతడు టీమిండియా క్రికెటర్ లాగే మైదానంలో కలియదిరుగుతూ దర్శనమిచ్చాడు అతడిని లార్డ్స్ మైదాన సిబ్బంది వచ్చి బలవంతంగా బయటికి లాక్కెళ్లారు.