వైఎస్ వివేక కుమార్తె సునీత ఇంటిముందు రెక్కీ నిర్వహించిన నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- సునీత ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు
- నిందితుడు మణికంఠరెడ్డిగా గుర్తించి అదుపులోకి
- విచారిస్తోన్న డీఎస్పీ శ్రీనివాసులు
మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు బృందం విచారణ జరుపుతూ కీలక విషయాలను రాబడుతోన్న నేపథ్యంలో తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన కుమార్తె సునీత కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఓ వ్యక్తి తమ ఇంటి ముందు రెక్కీ నిర్వహించడంతో ఆమె ఈ ఫిర్యాదు చేశారు.
ఈ నెల 10న ఒక అనుమానితుడు తమ ఇంటి చుట్టూ తిరిగాడని, ఫోన్ కాల్స్ కూడా చేశాడని సునీత ఫిర్యాదులో పేర్కొనడంతో దీనిపై దృష్టి సారించిన పోలీసులు అతడిని గుర్తించారు. నిందితుడు మణికంఠ రెడ్డిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అతడిని డీఎస్పీ శ్రీనివాసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.