ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్... రెండోదశ ట్రయల్స్ కు భారత్ బయోటెక్ కు అనుమతి

  • ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్
  • అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్
  • ప్రపంచంలోనే తొలిసారిగా నాసల్ కరోనా వ్యాక్సిన్
  • ఇప్పటికే తొలి దశ ట్రయల్స్ పూర్తి
భవిష్యత్తులో ముక్కు ద్వారా వేసుకునే కరోనా టీకాలు రానున్నాయి. ఈ అంశంలో దేశీయ వ్యాక్సిన్ ఉత్పత్తిదారు భారత్ బయోటెక్ అందరికంటే ముందు నిలిచింది. ప్రపంచంలోనే తొలిసారిగా ముక్కుద్వారా వేసే కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది.

తాజాగా, ముక్కు ద్వారా వేసే కరోనా వ్యాక్సిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు భారత్ బయోటెక్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే తొలిదశ క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి. తొలిదశలో 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వారిపై క్లినికల్ ట్రయల్స్ చేపట్టారు.


More Telugu News