భార్యాభర్తల మధ్య బలవంతపు శృంగారం చట్ట విరుద్ధం కాదు: ముంబై కోర్టు
- భర్త బలవంతంగా అనుభవించడంతో పక్షవాతం వచ్చిందంటూ భార్య ఫిర్యాదు
- అత్తామామలు వరకట్న వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణ
- భార్యతో భర్త బలవంతంగా శృంగారంలో పాల్గొన్నా అది చట్ట విరుద్ధం కాదన్న కోర్టు
భార్య ఇష్టం లేకుండా శృంగారం కోసం ఆమెను బలవంత పెట్టడం సరికాదంటూ గతంలో పలు సందర్భాల్లో వివిధ కోర్టులు తీర్పులను వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే, ముంబై అడిషనల్ సెషన్స్ కోర్టు గత తీర్పులకు విరుద్ధమైన తీర్పునిచ్చింది. భార్యాభర్తల మధ్య బలవంతపు శృంగారం ఎంత మాత్రం చట్ట విరుద్ధం కాదని తీర్పును వెలువరించింది. శృంగారంలో పాల్గొన్నది మహిళ భర్తే కావడం వల్ల ఈ కేసు చట్టం ముందు నిలబడదని చెప్పింది.
కేసు వివరాల్లోకి వెళ్తే, అత్తామామలు, భర్తపై సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ప్రకారం... మహారాష్ట్రకు చెందిన ఒక మహిళకు గత నవంబర్ 22న పెళ్లైంది. వివాహమైన కొన్ని రోజులకు అత్తామామలు ఆమెను వరకట్న వేధింపులకు గురి చేస్తూ వచ్చారు. ఆమెపై పలు ఆంక్షలను కూడా విధించారు.
పెళ్లైన నెల రోజుల తర్వాత ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా భర్త బలవంతంగా శృంగారంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత జనవరి 2న మహాబలేశ్వరం వెళ్లినప్పుడు కూడా బలవంతంగా అనుభవించాడు. అప్పటి నుంచి ఆమెకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. వైద్యులను సంప్రదించగా నడుము కింద భాగం పక్షవాతానికి గురైనట్టు నిర్ధారించారు. భర్త వల్లే తనకు ఈ సమస్య వచ్చిందని భావించిన సదరు మహిళ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో ఆమె అత్తామామలు ముందస్తు బెయిల్ కోసం అడిషనల్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. వరకట్నం కోసం తాము వేధించలేదని... తమపై తప్పుడు కేసు పెట్టిందని కోర్టుకు తెలిపారు. తమ కొడుకు, కోడలితో తాము కేవలం రెండు రోజులు మాత్రమే ఉన్నామని చెప్పారు. ఈ సందర్భంగా కోర్టు జడ్జి సంజశ్రీ ఘరాత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న వయసులోనే మహిళ పక్షవాతానికి గురి కావడం బాధాకరమని చెప్పారు. అయితే, దీనికి భర్తే కారణం అని ఆరోపించడం సరి కాదని అన్నారు. పెళ్లి తర్వాత భార్యతో భర్త బలవంతంగా శృంగారంలో పాల్గొన్నా అది చట్ట విరుద్ధం కాదని చెప్పారు. అత్తామామలు అదనపు కట్నం కోసం వేధించారంటున్న మహిళ.. వారు ఎంత డిమాండ్ చేశారనే విషయాన్ని చెప్పడం లేదని అన్నారు. దీంతో భర్తకు, అత్తామామలు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.