ఈ దాడిలో కచ్చితంగా వైసీపీ స్థానిక నాయకుల, అధికారుల ప్రోద్బలం ఉంది: జీవీఎల్
- బీజేపీ వినుకొండ పట్టణ అధ్యక్షుడు రమేశ్ పై దాడి
- దుండగులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను
- ఇనప రాడ్లతో, కర్రలతో దాడి.. ఒళ్లంతా గాయాలు
- తలపై ఎనిమిది కుట్లు, చేతికి ఆపరేషన్, కాళ్లంతా దెబ్బలు
బీజేపీ వినుకొండ పట్టణ అధ్యక్షుడు రమేశ్ పై దుండగులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. వెంటనే ఈ దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
'బాధితుడు రమేశ్ గారితో, నరసరావుపేట జిల్లా అధ్యక్షుడు సైదిరెడ్డిగారితో, పట్టణ అధ్యక్షుడు రామకృష్ణతో మాట్లాడాను. శివాలయ విధ్వంసాన్ని వ్యతిరేకించారని మర్డర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది' అని జీవీఎల్ పేర్కొన్నారు.
'ఒళ్లంతా గాయాలతో నరసరావుపేట ఆసుపత్రిలో రమేశ్ చికిత్స పొందుతున్నారు. ఇనుప రాడ్లతో, కర్రలతో దాడి. తలపై ఎనిమిది కుట్లు, చేతికి ఆపరేషన్, కాళ్లంతా దెబ్బలు. పట్టపగలు దాడి చేస్తే పోలీసులు నిద్రపోతున్నారా? అధికారులే మర్డర్ కు స్కెచ్ వేశారా? అనే అనుమానం కలుగుతోంది' అని అన్నారు.
'వెంటనే ఈ దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకపోతే బీజేపీ ఈ ప్రభుత్వ అరాచకాలపైన పోరాటం చేస్తుంది. ఈ దాడిలో కచ్చితంగా వైసీపీ స్థానిక నాయకుల, అధికారుల ప్రోద్బలం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది' అని ఆరోపించారు.