సీఎం జగన్ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారు: నాదెండ్ల మనోహర్

  • ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి పథకాలను అమలు చేస్తున్నారు
  • పరిమితికి మించి రుణాలు తీసుకోవడం వల్ల రాష్ట్రం దివాలా తీసింది
  • రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక మోసాలకు తెరతీసింది
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై జనసేన నేత నాదెండ్ల మనోహర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఆస్తులను తాక్టటు పెట్టి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. పరిమితికి మించి రుణాలు తీసుకోవడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక మోసాలకు తెరతీసిందని దుయ్యబట్టారు.

సూట్ కేస్ కంపెనీలను నడిపినట్టు ఏపీని జగన్ అధోగతిపాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర మంత్రులకు వారి శాఖలపై పట్టులేదని అన్నారు. ఉద్యోగులకు కూడా జీతాలను ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పారు. కాకినాడలో ఈరోజు జనసేన పార్టీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి నాడెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముమ్మిడివరం, ఇసుకపల్లి జనసేన కార్యకర్తలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు.


More Telugu News