రెండు ముక్కలైన భారీ నౌక.. వీడియో ఇదిగో
- నేలను తాకడంతో ప్రమాదం
- పెద్ద ఎత్తున చమురు సముద్రపాలు
- జపాన్‌లోని అమోరి ఫ్రిఫెక్చర్ హచినొహె పోర్టు సమీపంలో ఘటన
- సురక్షితంగా బయటపడ్డ 21 మంది సిబ్బంది
చమురు రవాణా నౌక క్రిమ్సన్ పొలారిస్ రెండు ముక్కలైంది. దీంతో పెద్ద ఎత్తున చమురు సముద్రంలో కలిసిపోయింది. ఈ ఘటన జపాన్‌లోని అమోరి ఫ్రిఫెక్చర్ హచినొహె పోర్టు సమీపంలో చోటు చేసుకుంది. ఆ నౌక నేలను తాకడంతో రెండు ముక్కలైందని అధికారులు తెలిపారు.
నౌకలోని చమురు సముద్రంలో పడడంతో ఏకంగా 24 కిలోమీటర్ల పొడవు, 800 మీటర్ల వెడల్పున తెట్టు ఏర్పడిందని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. నౌక రెండుగా విడిపోయిన సమయంలో అందులో ఉన్న 21 మంది సిబ్బందికి ఏ ప్రమాదమూ జరగలేదని, వారు సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు.