బుల్ జోరు.. చరిత్రలో తొలిసారి 55 వేల మార్కును దాటిన సెన్సెక్స్
- 55,105 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్
- 82 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- రియాల్టీ, హెచ్సీ, టెలికాం మినహా లాభాలల్లో కొనసాగుతున్న ఇతర సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 55 వేల మార్కును దాటింది. సూచీలు జీవనకాల గరిష్ఠాల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 10.33 గంటల సమయంలో సెన్సెక్స్ 261 పాయింట్ల లాభంతో 55,105 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 82 పాయింట్లు పెరిగి 16,447 వద్ద కొనసాగుతోంది. రియాల్టీ, హెల్త్ కేర్, టెలికాం సూచీలు మినహా మిగిలిన అన్ని సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ లో బజాజ్ ఆటో, ఏసియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర కంపెనీలు లాభాల్లో కొనసాగుతుండగా... బజాజ్ ఫైనాన్స్, భారతి ఎయిర్ టెల్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతి సుజుకి తదితర కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.