తాలిబన్లతో అధికారాన్ని పంచుకునేందుకు ఆఫ్ఘన్ ప్రభుత్వం రెడీ!

  • అఫ్ఘనిస్థాన్ నుంచి వైదొలగిన అమెరికా సేనలు
  • రెచ్చిపోతూ విధ్వంసం సృష్టిస్తున్న తాలిబన్లు
  • దేశంలో హింసకు చరమగీతం పాడాలని ప్రభుత్వం నిర్ణయం!
ఆఫ్ఘనిస్థాన్ గడ్డపై నుంచి అమెరికా సేనలు వెనుదిరిగిన తర్వాతి నుంచి రెచ్చిపోతున్న తాలిబన్లు దేశంలో రక్తపాతం సృష్టిస్తున్నారు. దేశంలోని కీలక ప్రాంతాలను వశపరుచుకున్నారు. నిన్న గజ్నీ పట్టణం కూడా వారి సొంతమైంది. ఈ నేపథ్యంలో దేశంలో హింసకు చరమగీతం పాడాలని నిర్ణయించిన ప్రభుత్వం తాలిబన్లతో కలిసి అధికారాన్ని పంచుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మధ్యవర్తిగా ఉన్న ఖతర్‌ ముందు ఈ ప్రతిపాదన ఉంచినట్టు తెలుస్తోంది. తాలిబన్లు ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే అధికారం వారి హస్తగతం అవుతుంది. కాగా, గజ్నీ పట్టణాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న విషయాన్ని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ధ్రువీకరించింది.


More Telugu News