తెలంగాణలో మరో 453 మందికి కొవిడ్ పాజిటివ్
- గత 24 గంటల్లో 89,675 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 69 కేసులు
- కరీంనగర్ జిల్లాలో 55 మందికి పాజిటివ్
- రాష్ట్రంలో ముగ్గురి మృతి
- ఇంకా 8,137 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 89,675 నమూనాలు పరీక్షించగా, 453 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 69 కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 55, వరంగల్ అర్బన్ జిల్లాలో 38 కేసులు వెల్లడయ్యాయి. నారాయణపేట జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 591 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు.
తెలంగాణలో ఇప్పటిదాకా 6,51,288 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,39,456 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 8,137 మంది చికిత్స పొందుతున్నారు. అటు కరోనా మృతుల సంఖ్య 3,836కి పెరిగింది.
తెలంగాణలో ఇప్పటిదాకా 6,51,288 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,39,456 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 8,137 మంది చికిత్స పొందుతున్నారు. అటు కరోనా మృతుల సంఖ్య 3,836కి పెరిగింది.