లార్డ్స్ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్.... ఇక్కడా వరుణుడే!
- టీమిండియా, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
- శార్దూల్ ఠాకూర్ స్థానంలో ఇషాంత్ శర్మ
- ఒకే ఒక్క మార్పుతో బరిలోకి భారత్
- ఇంగ్లండ్ జట్టులో మూడు మార్పులు
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో రెండో టెస్టుకు సర్వం సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇటీవల నాటింగ్ హామ్ లో జరిగిన తొలి టెస్టు వరుణుడి ప్రభావంతో డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. దాంతో లార్డ్స్ టెస్టుపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. దురదృష్టం కొద్దీ ఈ మ్యాచ్ లోనూ వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. ఆటగాళ్లు మైదానంలోకి వచ్చారో లేదో వెలుతురు మందగించింది. వర్షం పడే పరిస్థితులు ఉండడంతో పిచ్ ను కవర్లతో కప్పేశారు. దాంతో ఆటగాళ్లు ఉసూరుమంటూ డ్రెస్సింగ్ రూమ్ బాటపడ్డారు.
తుదిజట్ల విషయానికొస్తే... నాటింగ్ హామ్ పిచ్ స్వింగ్ కు అనుకూలిస్తుండడంతో జట్టులోకి తీసుకున్న శార్దూల్ ఠాకూర్ కు రెండో టెస్టులో ఆడే అవకాశం దక్కలేదు. శార్దూల్ స్థానంలో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ టీమిండియాలో స్థానం దక్కించుకున్నాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు ఈ టెస్టులోనూ స్థానం దక్కలేదు. ఇక ఇంగ్లండ్ జట్టులో జాక్ క్రాలే స్థానంలో హసీబ్ హమీద్, స్టూవర్ట్ బ్రాడ్ స్థానంలో మార్క్ ఉడ్, డాన్ లారెన్స్ స్థానంలో మొయిన్ అలీ వచ్చారు.