షర్మిలకు జగన్ సగం ఆస్తిని ఇవ్వాలి: రఘురామ

  • వైసీపీ గెలుపులో షర్మిలకు సగం పాత్ర ఉంది
  • పార్టీ కోసం గొప్పగా ప్రచారం చేశారు
  • అంబటి రాంబాబు కూడా ఎంతో కష్టపడ్డారు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి టార్గెట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి రావడంలో జగన్ సోదరి షర్మిల పాత్ర కూడా ఉందని ఆయన అన్నారు. వైసీపీ గెలుపు కోసం షర్మిల ఎంతో కష్టపడ్డారని, గొప్పగా ప్రచారం చేశారని చెప్పారు. ఇప్పుడు ఆమె తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్నారని అన్నారు.

జగన్ తనకున్న ఆస్తిలో సగ భాగాన్ని షర్మిలకు ఇవ్వాలని చెప్పారు. వైసీపీ విజయంలో సగం పాత్రను పోషించిన షర్మిలకు ఆస్తిలో కూడా సగ భాగం ఇవ్వడమే న్యాయమని అన్నారు. వైసీపీ విజయంలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పాత్ర కూడా ఉందని చెప్పారు. న్యాయ శాస్త్రాన్ని అభ్యసించిన అంబటి స్వతహాగా మంచి వాగ్ధాటి కలిగిన వ్యక్తి అని అన్నారు. పార్టీలో ఆయనకు మంచి గుర్తింపు ఇవ్వాలని సూచించారు.


More Telugu News