వైఎస్సార్ పురస్కారాల ప్రదానోత్సవం వాయిదా

  • 150 మందికి మించి ప్రజలు గుమికూడరాదన్న ఉత్తర్వుల నేపథ్యంలో వాయిదా
  • షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13న జరగాల్సిన కార్యక్రమం
  • అక్టోబర్ లేదా నవంబర్ లో జరిగే అవకాశం
వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ కార్యక్రమం ఈ నెల 13న జరగాల్సి ఉంది. అవార్డు గ్రహీతల్లో పెద్ద వయసు వారు ఉండటంతో పాటు... కరోనా నేపథ్యంలో 150 మందికి మించి ప్రజలు గుమికూడరాదన్న వైద్యారోగ్య శాఖ ఉత్తర్వుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

దీంతో అవార్డుల కార్య్రక్రమాన్ని అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో నిర్వహించనున్నట్టు ప్రకటించింది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 11 మంది, లలిత కళలు, సాహిత్య విభాగంలో ఏడుగురు, జర్నలిజంలో ఏడుగురు, సాంస్కృతిక రంగాల్లో 20 మంది, కోవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ యోధులు ఏడుగురు, ఉత్తమ సేవలందించిన మరో 8 సంస్థలకు అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే.


More Telugu News