చక్రసిద్ధ అద్భుతమైన, ప్రాచీనమైన వైద్య చికిత్స: మహేశ్ బాబు
- చక్రసిధ్ హెల్త్ కేర్ సెంటర్ ను ప్రారంభించిన మహేశ్ బాబు
- సిద్ధ వైద్యం ద్వారా ఏ వ్యాధినైనా నయం చేయవచ్చన్న మహేశ్
- జీవనశైలిని కూడా మార్చుతుందని వ్యాఖ్య
సినీ హీరో మహేశ్ బాబు పలు సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. రెయిన్ బో హాస్పిటల్ తో కలిసి ఎందరో చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేయిస్తున్నారు. తాజాగా ఆయన మరో అడుగు వేశారు. హైదరాబాద్ లోని శంకర్ పల్లి సమీపంలో ఉన్న మోకిల వద్ద చక్రసిధ్ అనే హెల్త్ కేర్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శాంత బయోటిక్స్ ఛైర్మన్ వరప్రసాద్ రెడ్డి, సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల హాజరయ్యారు.
ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ, సిద్ధ వైద్యం ఒక అద్భుతమైన, ప్రాచీనమైన, సంప్రదాయమైన చికిత్స అని అన్నారు. ఈ వైద్యాన్ని ప్రోత్సహించడం సంతోషకరమని చెప్పారు. ఈ చికిత్స కేవలం వ్యాధిని నయం చేయడమే కాక... మొత్తం జీవనశైలిని మార్చడంలో మనకు సహాయపడుతుందని అన్నారు. చక్రసిద్ధ వైద్యంలో డాక్టర్ సింధుజ నిపుణురాలని... ఆమె సూచనల ప్రకారం చికిత్స విధానాలను అనుసరిస్తే అద్భుతాలను చూడవచ్చని చెప్పారు. మన జీవన శైలిని కూడా మెరుగుపరుచుకోవచ్చని అన్నారు. ఈ వైద్య చికిత్స ద్వారా ఏ వ్యాధినైనా నయం చేయవచ్చని తెలిపారు.