రాజమండ్రి ప్రాంతంలో సాఫ్ట్ వేర్ హబ్ లేకపోవడం గమనార్హం: గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి

  • రాజమండ్రికి ఐటీ కంపెనీ అనేది కల
  • ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉంది
  • ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్య పూర్తి చేస్తున్నారు
  •  పూణే,  హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు తరలి వెళ్తున్నారు
రాజమండ్రిలో ఐటీ హ‌బ్ నెల‌కొల్పాల‌ని టీడీపీ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి డిమాండ్ చేశారు. 'రాజమండ్రికి ఐటీ కంపెనీ అనేది కల లాగా కాకుండా ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్య పూర్తి చేసి పూణే, హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు తరలి వెళ్తున్నారు. అమోఘమైన మేధా సంపత్తి మన పరిసర ప్రాంత యువతకి ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో సాఫ్ట్ వేర్ హబ్ లేకపోవడం గమనార్హం' అని ఆయ‌న పేర్కొన్నారు.

'కనీసం ఇంక్యుబేషన్ సెంటర్లు లాంటివి ఏర్పాటు చేసి యువతలో నైపుణ్యం వెలికి తీసి అంకుర సంస్థ‌కి ప్రోత్సాహకాలు ఇస్తే కాస్త మెరుగు పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి రాజమండ్రికి ఐటీ హ‌బ్‌ అనేది ప్రోత్సహించవలసిన విషయం. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేసి గోదావరి ప్రాంతంలో ఐటీ పార్క్ నెలకొల్పాలని ఆశిస్తున్నాను' అని గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి కోరారు.


More Telugu News