కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పై మోదీ ఫొటో... వివరణ ఇచ్చిన కేంద్రం
- రాజ్యసభలో ప్రశ్నించిన కుమార్ ఖేట్కర్
- కాంగ్రెస్ సభ్యుడికి సమాధానమిచ్చిన మంత్రి
- కరోనాపై మోదీ సందేశమిచ్చారని వెల్లడి
- ఫొటోతో పాటు సందేశం ముద్రించామని వివరణ
కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక అధికారులు జారీ చేసే సర్టిఫికెట్ పై ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మ కూడా దర్శనమిస్తుంది. దీనిపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, మాజీ పాత్రికేయుడు కుమార్ ఖేట్కర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పై మోదీ బొమ్మ ఉండాల్సిన అవసరం ఏమిటని అడిగారు. అదేమైనా తప్పనిసరా? అంటూ వివరణ కోరారు. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్ పవార్ సమాధానమిచ్చారు.
తొలుత కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న రీతిని వివరించారు. ఆపై, కరోనా వ్యాక్సినేషన్ తీసుకున్నప్పటికీ ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన తీరును ప్రస్తావించారు. అందుకే కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పై మోదీ బొమ్మను, ఆయన ఇచ్చిన సందేశాన్ని ముద్రిస్తున్నామని వివరణ ఇచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మోదీ వివరంగా చెప్పారని, ఆయన సందేశం ప్రజల్లో తప్పకుండా అవగాహన కలిగిస్తుందని ఆమె తెలిపారు.
ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఇది నైతిక బాధ్యతగా భావిస్తున్నామని, వ్యాక్సిన్ తో సరిపెట్టకుండా మరింత చైతన్యం కలిగించేలా సందేశం ఇవ్వడం ప్రభుత్వ ధర్మం అని వివరించారు.