తెలంగాణలో ఎంసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

  • ఈ నెల 4 నుంచి జరుగుతున్న ఎంసెట్
  • ఆ నెల 30 నుంచి సర్టిఫికెట్ల స్లాట్ బుకింగ్
  • సెప్టెంబరు 4 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన
  • సెప్టెంబరు 15న తొలి విడత సీట్ల కేటాయింపు
తెలంగాణలో ఆగస్టు 4 నుంచి 10 వరకు ఎంసెట్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో, ఎంసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 30 నుంచి సెప్టెంబరు 9 వరకు ధ్రువపత్రాల స్లాట్ బుకింగ్ ఉంటుంది. సెప్టెంబరు 4 నుంచి 11 వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టనున్నారు. సెప్టెంబరు 13 వరకు వెబ్ ఆప్షన్స్ నమోదుకు అవకాశం కల్పించారు. సెప్టెంబరు 15న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబరు 15 నుంచి 20 వరకు కాలేజీల్లో ఆన్ లైన్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు.

ఇవాళ తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన ప్రవేశ పరీక్షల కమిటీ సభ్యులు, విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చర్చించి ఎంసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఖరారు చేశారు.


More Telugu News