ఎంపీ విజయసాయిరెడ్డి పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు
- జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయి పిటిషన్
- ఈడీ కేసులు మొదట విచారించాలన్న సీబీఐ కోర్టు
- హైకోర్టులో సవాల్ చేసిన విజయసాయి
- విజయసాయి వాదనలను తోసిపుచ్చిన హైకోర్టు
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయి పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈడీ కేసులు తొలుత విచారణ జరపాలని సీబీఐ కోర్టు ఆదేశించడాన్ని విజయసాయి హైకోర్టులో సవాల్ చేశారు. మొదట సీబీఐ కేసులు విచారణ జరపాలని, లేదంటే సీబీఐ, ఈడీ కేసులు రెండింటిని సమాంతరంగా విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని విజయసాయి హైకోర్టును కోరారు.
అయితే, హైకోర్టు విజయసాయిరెడ్డి వాదనలను తోసిపుచ్చింది. ఈడీ కేసులే మొదట విచారించాలన్న సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. అటు, జగతి పబ్లికేషన్స్, రఘురాం సిమెంట్స్ పిటిషన్లను కూడా హైకోర్టు కొట్టివేసింది.