ఏపీ ప్రభుత్వంపై స్వామి శ్రీనివాసానంద సరస్వతి విమర్శలు
- హిందువులు, దేవాలయాలకు రక్షణ లేకుండా పోయింది
- మత మార్పిడిలు జరుగుతున్నాయి
- ఎన్నో దారుణాలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తోంది
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ఒక క్రైస్తవ రాష్ట్రంగా మారిపోయిందని స్వామి శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు. రాష్ట్రంలో హిందువులు, హిందూ దేవాలయాలు, దేవాలయాల భూములు, హిందూ సనాతన సంప్రదాయాలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. హిందూసనాతన ధర్మాన్ని నాశనం చేసేందుకు జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని దుయ్యబట్టారు. దేవాలయాలపై దాడులు జరుగుతున్నా, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా దోషులను ప్రభుత్వం ఇంత వరకు పట్టుకోలేదని చెప్పారు.
కొందరు రాష్ట్ర మంత్రులు కూడా హిందూ ధర్మాన్ని, సంప్రదాయాలను అగౌరవపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తూ, మత మార్పిడిలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. దోషులను శిక్షించి హిందువుల్లో మనోధైర్యాన్ని ప్రభుత్వం ఎందుకు కల్పించలేకపోతోందని ప్రశ్నించారు.