జమ్మూకశ్మీర్ లోని ఖీర్ భవాని ఆలయంలో పూజల్లో పాల్గొన్న రాహుల్ గాంధీ
- జమ్మూకశ్మీర్‌లో రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన
- నిన్న సాయంత్రం శ్రీనగర్ విమానాశ్రయం చేరుకున్న రాహుల్
- కాసేపట్లో హజ్రత్‌బల్ దర్గాకు కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాదాపు రెండేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్ వెళ్లారు. అక్కడ ఆయన రెండు రోజుల పాటు పర్యటిస్తారు. ఈ మేరకు ఆయన నిన్న సాయంత్రం శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. జమ్మూకశ్మీర్ పీసీసీ అధ్యక్షుడు ఘులాం అహ్మద్ మిర్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన తన పర్యటన కొనసాగిస్తున్నారు.
ఈ రోజు గందెర్‌బల్ జిల్లాలోని ఖీర్ భవాని ఆలయాన్ని ఆయన పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తో కలిసి దర్శించుకున్నారు. కాసేపట్లో ఆయన దాల్ సరస్సు ఒడ్డున ఉన్న హజ్రత్‌బల్ దర్గాకు వెళ్లి ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత, శ్రీనగర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ భవన్‌ను ప్రారంభిస్తారు. అక్కడే పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. ఈ రోజు సాయంత్రం తిరిగి ఢిల్లీ చేరుకుంటారు.