విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా.. కౌంటర్ దాఖలుకు మరింత గడువు కోరిన సీబీఐ
- విచారణ ఈ నెల 13కు వాయిదా
- విజయసాయిరెడ్డి కోర్టు షరతులు ఉల్లంఘించారంటూ పిటిషన్
- ఈ నెల 7న పిటిషన్ వేసిన రఘురామ కృష్ణరాజు
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 13కు వాయిదా వేసింది. విజయసాయిరెడ్డి కోర్టు షరతులు ఉల్లంఘించారంటూ ఈ నెల 7న రఘురామ కృష్ణరాజు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
దీంతో బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణలో భాగంగా విజయసాయిరెడ్డికి, సీబీఐకి కోర్టు నోటీసులు జారీ చేసింది. రఘురామ వేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగానే ఈ రోజు విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది.
అయితే, కౌంటర్ దాఖలుకు మరింత గడువు కావాలని సీబీఐ అధికారులు కోరారు. ఈ నేపథ్యంలోనే విచారణ వాయిదా పడింది. ఇప్పటికే అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ వేసిన పిటిషన్‌పై కూడా కోర్టులో విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే.