ఇద్దరు మహిళలు సహా ఏడుగురు అమరావతి ఉద్యమకారులపై కేసు నమోదు
- రాయపాటి శైలజ, కంభంపాటి శిరీషలపై కేసు నమోదు
- నిరసన తెలిపే హక్కు లేకుండా చేస్తున్నారన్న ఉద్యమకారులు
- హైకోర్టులో సవాల్ చేస్తామని వ్యాఖ్య
ఏడుగురు అమరావతి ఉద్యమకారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉండటం గమనార్హం. రాయపాటి శైలజ, కంభంపాటి శిరీష, చిలక బసవయ్య, కొమ్మినేని సత్యనారాయణ, గడ్డం మార్టిన్, వాడ సుధాకర్, బేతపూడి సుధాకర్ లపై సెక్షన్ 143, 149, 269, 271, 341, 59 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించారని ఎఫ్ఐఆర్ లో పోలీసులు పేర్కొన్నారు.
మరోవైపు ఈ కేసులపై ఉద్యమకారులు స్పందిస్తూ... దేవస్థానం వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తామంటే పోలీసులు అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కేసును తాము హైకోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు.