'పాగల్' కథ వినగానే ఏడ్చేశానంటున్న నివేద పేతురాజ్!
- 'పాగల్' నాకు నచ్చిన కథ
- 'తీర' పాత్రలో కనిపిస్తాను
- యూత్ కి కనెక్ట్ అవుతుంది
- నా కెరియర్ కి హెల్ప్ అవుతుంది
విష్వక్సేన్ హీరోగా 'పాగల్' సినిమా రూపొందింది. బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమా ద్వారా నరేశ్ కుప్పిలి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా నివేదా పేతురాజ్ నటించింది. ఈ నెల 14వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి నివేద పేతురాజ్ మాట్లాడింది.
"కొంతకాలం క్రితం నరేశ్ కుప్పిలి చెన్నైకి వచ్చి నన్ను కలిశారు. 'పాగల్' సినిమా గురించి వచ్చానని చెబుతూ, ఆ కథను నాకు వినిప్పించారు. కథ వినగానే నేను కనెక్ట్ అయ్యాను. నా పాత్ర గురించి ఆయన చెబుతున్నప్పుడు నిజంగానే నా కళ్ల వెంట నీళ్లొచ్చాయి. నరేశ్ గారు వెళ్లిపోయిన తరువాత కూడా నేను ఆ కథను గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను.
'ఈ సినిమాలో నేను 'తీర' అనే పాత్రను పోషించాను. ఇంతవరకూ నేను చేసిన పాత్రలకి ఇది భిన్నంగా ఉంటుంది. యూత్ ను తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా సక్సెస్ ను సాధిస్తుందనీ, ఈ పాత్ర నా కెరియర్ కి హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చింది.