దేశంలో భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు
- 147 రోజుల కనిష్ఠ స్థాయిలో కొత్త కేసులు
- నిన్న 28,204 కేసులు
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,19,98,158
- నిన్న 373 మంది మృతి
భారత్‌లో కొత్త కరోనా కేసులు భారీగా తగ్గాయి. 147 రోజుల కనిష్ఠ స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. భారత్‌లో నిన్న 28,204 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,19,98,158కు చేరింది.
ఇక మరణాల విషయానికొస్తే... నిన్న 373 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,28,682కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,11,80,968 మంది కోలుకున్నారు. 3,88,508 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు మొత్తం 51,45,00,268 వ్యాక్సిన్ డోసులు వేసినట్టు అధికారులు ప్రకటించారు. రికవరీ రేటు 97.45 శాతంగా ఉంది.