పోలవరంపై టీడీపీ సభ్యుడు కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం

  • పోలవరం అంశాన్ని లేవనెత్తిన కనకమేడల
  • జవాబిచ్చిన మంత్రి ప్రహ్లాద్ సింగ్
  • వంద శాతం ఖర్చు కేంద్రం భరిస్తుందని వెల్లడి
  • రూ.11,600 కోట్లు చెల్లించినట్టు వివరణ
పోలవరం ప్రాజెక్టు అంశంపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఇవాళ రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. కనకమేడల ప్రశ్నకు కేంద్రం జవాబు ఇచ్చింది. తమ తరఫున రాష్ట్రమే పోలవరం నిర్మాణం చేపడుతోందని కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ వెల్లడించారు.

2014 ఏప్రిల్ నుంచి ప్రాజెక్టు నిర్మాణ ఖర్చును 100 శాతం కేంద్రమే భరిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రం చేసిన ఖర్చులు పరిశీలించాక రీయింబర్స్ చేస్తామని వివరించారు. పీపీఏ, సీడబ్ల్యూసీ సిఫారసులతో ఆర్థిక శాఖ రీయింబర్స్ చేస్తుందని జలశక్తి మంత్రి లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ.11,600 కోట్లు రీయింబర్స్ చేశామని వెల్లడించారు.


More Telugu News