తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కేశవరావు మృతి పట్ల సంతాపం తెలిపిన సీజేఐ ఎన్వీ రమణ
- జస్టిస్ కేశవరావు గుండెపోటుతో మృతి
- విచారం వ్యక్తం చేసిన సీజేఐ ఎన్వీ రమణ
- న్యాయం కోసం పరితపించే వ్యక్తి అని వెల్లడి
- న్యాయవ్యవస్థకు తీరనిలోటు అని వ్యాఖ్యలు
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు (60) మృతిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జస్టిస్ కేశవరావు 35 ఏళ్ల న్యాయ జీవితంలో వివిధ హోదాల్లో పనిచేశారని తెలిపారు. న్యాయం కోసం ఎప్పుడూ పరితపించే వ్యక్తి కేశవరావు అని కొనియాడారు. కేశవరావు మృతి న్యాయవ్యవస్థకు తీరనిలోటు అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న న్యాయమూర్తి కేశవరావు హైదరాబాదులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఈ తెల్లవారుజామున గుండెపోటుకు గురయ్యారు. ఆయన మృతితో తెలంగాణలో కోర్టులకు సెలవు ప్రకటించారు. సీఎం కేసీఆర్ కూడా జస్టిస్ కేశవరావు మృతి పట్ల స్పందిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.