ఏపీలో ఈ నెల 16 నుంచి ఇంటర్ విద్యార్థులకు తరగతులు

  • మళ్లీ తెరుచుకుంటున్న విద్యాసంస్థలు
  • ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు రెగ్యులర్ క్లాసులు
  • ప్రస్తుతం ఆన్ లైన్ లో బోధన
  • ఇకపై కరోనా మార్గదర్శకాలతో ఆఫ్ లైన్ బోధన
ఏపీలో విద్యాసంస్థలు మళ్లీ తెరుచుకుంటున్నాయి. కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు భావిస్తున్న ప్రభుత్వం, విద్యాసంస్థల ప్రారంభానికి సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో, రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి జూనియర్ కాలేజీలు తెరుచుకోనున్నాయి. ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు రెగ్యులర్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహిస్తున్నారు.

కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు రెగ్యులర్ క్లాసులు బోధించాలని కాలేజీల యాజమాన్యాలకు, ప్రిన్సిపాళ్లకు ఇంటర్మీడియెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. అటు, ఈ నెల 16 నుంచి పాఠశాలలు కూడా తెరుచుకుంటుండడం తెలిసిందే.


More Telugu News