ఆదివాసీలతో ఆడిపాడిన ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

  • నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
  • విజయనగరం జిల్లా పార్వతీపురంలో వేడుకలు
  • హాజరైన పుష్ప శ్రీవాణి
  • ఉత్సాహంగా థింసా నృత్యం చేసిన వైనం
ఇవాళ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా పార్వతీపురంలోనూ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి హోదాలో ఈ వేడుకలకు విచ్చేసిన పుష్ప శ్రీవాణి ఆదివాసీలతో కలిసి ఉత్సాహంగా ఆడిపాడారు. సంప్రదాయ థింసా నృత్యానికి ఉల్లాసంగా కాలు కదిపారు. సబ్ కలెక్టర్ భావన కూడా థింసా నృత్యం చేశారు.

అంతకుముందు, పుష్ప శ్రీవాణి గిరిజన మాత విగ్రహానికి అభిషేకం చేశారు. ఈ వేడుకల్లో పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు కూడా పాల్గొన్నారు. ఆయన డప్పు కొట్టి అలరించారు.


More Telugu News