ఆరు రోజుల క్రితం మ్యాన్ హోల్ లో గల్లంతైన కార్మికుడు అంతయ్య మృతదేహం లభ్యం
- హైదరాబాద్‌లోని వనస్థలిపురం పరిధిలోని సాహెబ్‌నగర్‌లో ఘటన
- డ్రైనేజీని శుభ్రం చేసేందుకు దిగిన ఇద్దరు కార్మికులు
- అందులోనే చిక్కుకుపోయిన వైనం
- ఒకరి మృతదేహం ఆరు రోజుల క్రితం లభ్యం
హైదరాబాద్ శివారు వనస్థలిపురం పరిధిలోని సాహెబ్‌నగర్‌లో ఇటీవల డ్రైనేజీని శుభ్రం చేసేందుకు దిగిన ఇద్దరు కార్మికులు అందులోనే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారిలో శివ అనే కార్మికుడి మృతదేహాన్ని ఇప్పటికే సహాయక బృందాలు బయటకు తీశాయి. అయితే, మ్యాన్ హోల్‌లో గల్లంతైన మరో కార్మికుడు అంతయ్య మృతదేహాన్ని సహాయక బృందాలు ఈ రోజు గుర్తించాయి.
ఆరు రోజుల తర్వాత అతని మృతదేహం బయటపడింది. మ్యాన్‌హోల్ లో గల్లంతైన ప్రాంతం నుంచి 350 మీటర్ల దూరంలో అంతయ్య మృతదేహం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆరు రోజులుగా కొనసాగిస్తోన్న రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. ఆరు రోజుల పాటు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం నాలాను తవ్వుతూ ఈ ఆపరేషన్‌లో పాల్గొంది.
కాగా, ఇటీవల రాత్రి సమయంలో నిబంధనలకు విరుద్ధంగా మురికి కాలువలోకి దిగాలని కాంట్రాక్టర్ చెప్పడంతో మొదట శివ మ్యాన్‌హోల్‌లోకి దిగాడు. అతను అందులోనే చిక్కుకుపోవడంతో కాపాడేందుకు వెళ్లిన అంతయ్య కూడా చిక్కుకుపోయాడు. చివరికి ఇద్దరూ మృతి చెందారు. దీంతో కాంట్రాక్టర్ స్వామిపై పోలీసులు కేసు నమోదు నమోదు చేశారు.