'టైగర్ నాగేశ్వర్రావ్'గా రవితేజ!
- షూటింగు పూర్తిచేసుకున్న 'ఖిలాడి''
- సెట్స్ పై 'రామారావు ఆన్ డ్యూటీ'
- లైన్లో త్రినాథరావు నక్కిన
- వంశీకృష్ణ ఆకెళ్లకి గ్రీన్ సిగ్నల్
కరోనా రావడానికి ముందు 'టైగర్ నాగేశ్వర్రావ్' పేరు వినిపించింది. అతను ఒక దొంగ .. 1970 - 80లలో వరుస దొంగతనాలతో హడలెత్తించినవాడు. దొంగతనాలు చేయడంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన నైపుణ్యం ఉండేది. అందువలన ఆయనను పట్టుకోవడం అసాధ్యంగా మారేది. అలాంటి 'టైగర్ నాగేశ్వర్రావ్' స్టోరీని వంశీకృష్ణ ఆకెళ్ల తెరకెక్కించాలని అనుకున్నాడు.
ఈ ప్రాజెక్టు కోసం ఆయన రెండేళ్ల క్రితమే రంగంలోకి దిగాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలైనప్పుడే, కరోనా విరుచుకుపడటం జరిగింది. ఆ తరువాత అన్ని ప్రాజెక్టుల మాదిరిగానే ఈ సినిమా ప్రయత్నాలు కూడా ఆగిపోయాయి. అప్పట్లో ఈ సినిమాలో రానాగానీ .. బెల్లంకొండ శ్రీనివాస్ గాని నటించే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా రవితేజ పేరు తెరపైకి వచ్చింది.
వంశీకృష్ణ ఆకెళ్ల ఇటీవల రవితేజను కలిసి ఈ కథను చెప్పాడట. ఈ కథ .. కథనం .. పాత్ర తీరు తెన్నులు నచ్చడంతో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం 'ఖిలాడి' షూటింగును పూర్తిచేసిన రవితేజ, 'రామారావు ఆన్ డ్యూటీ' షూటింగులో ఉన్నాడు. ఆ తరువాత ఆయన త్రినాథరావు నక్కినతో ఒక సినిమా చేయనున్నాడు. ఆ సినిమా తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది.