వస్త్రధారణ బాగుండలేదని.. అమ్మాయిని దారుణంగా చంపిన తాలిబన్లు
- ఆప్ఘనిస్థాన్ లో పెరిగిపోయిన తాలిబన్ల ప్రభావం
- వికృత చర్యలకు పాల్పడుతోన్న వైనం
- మహిళలు జాబ్ చేయకూడదని ఆదేశాలు
- బయటకు వెళ్తోన్న వారిపై దారుణాలు
ఆప్ఘనిస్థాన్ నుంచి అమెరికా బలగాలు వెనక్కి వెళ్తోన్న నేపథ్యంలో తాలిబన్ల ప్రభావం మళ్లీ పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఆఫ్ఘన్లో వికృత చర్యలకు పాల్పడుతూ ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది పౌరులను బలి తీసుకున్నారు. తాజాగా, ఓ అమ్మాయి శరీరాన్ని అతుక్కుని వుండే దుస్తులు ధరించిందన్న ఆరోపణతో ఆమెను తాలిబన్లు అత్యంత దారుణంగా చంపారు.
ఆమె పేరు నజానిన్ (21) అని, ఆమె బయటకు వెళ్తుండగా తాలిబన్లు చంపేశారని పోలీసులు గుర్తించారు. మహిళలు ఎవరూ జాబ్ చేయకూడదని, పని కోసం బయటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే బయట కనపడుతోన్న మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారు. అయితే, నజావిన్ను తాము చంపలేదని, పోలీసులు తమపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని తాలిబన్లు పేర్కొన్నారు.