గుడిసెలలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన 8 మంది

  • గుజ‌రాత్‌లోని అమ్రేలి జిల్లాలో ప్ర‌మాదం
  • మృతుల్లో ఇద్ద‌రు చిన్నారులు
  • మ‌రో న‌లుగురికి గాయాలు
వారంతా ఉండ‌డానికి ఇళ్లు కూడా లేని పేద‌వారు. రోడ్డు ప‌క్క‌న గుడిసెలు వేసుకుని వాటిలోనే జీవిస్తున్నారు. ఓ ట్ర‌క్కు అదుపుత‌ప్పి గుడిసెల పైకి దూసుకు రావ‌డంతో నిద్ర‌లోనే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మ‌రో న‌లుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

గాయాల‌పాల‌యిన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నామ‌ని వివ‌రించారు. ఈ ఘ‌ట‌న గుజరాత్ లోని అమ్రేలి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ రోజు  తెల్లవారుజామున 2.30 గంట‌ల‌కు బధడా గ్రామంలో ఈ ప్రమాదం జరిగిందని వివ‌రించారు. ట్రక్కును వేగంగా న‌డిపిన డ్రైవర్ దానిపై నియంత్రణ కోల్పోవ‌డ‌మే ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని అధికారులు చెప్పారు.


More Telugu News