ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో ప్రజలందరూ భాగం కావాలి: కిషన్ రెడ్డి

  • దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు
  • ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు
  • దేశవ్యాప్తంగా చేపడుతున్నట్టు కిషన్ రెడ్డి వెల్లడి
  • 75 వారాల పాటు జరుగుతాయని వివరణ
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట వేడుకలకు తెరదీసింది. దీనిపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు చేపడుతున్నట్టు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమాలు 75 వారాల పాటు జరుగుతాయని తెలిపారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో ప్రజలందరూ భాగం కావాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో సర్పంచులు కార్యక్రమం నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ జాతీయగీతం పాడి రాష్ట్ర గీత్ వెబ్ సైట్ లో ఉంచాలని సూచించారు. 2047 నాటికి దేశం ఏ స్థాయికి చేరాలో తమ అభిప్రాయాలను పంచుకోవాలని తెలిపారు.


More Telugu News