దండుకట్టి దండోరా మోగించబోతున్నాం: రేవంత్ రెడ్డి
- పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావాలి
- కేసీఆర్ పై పోరాటానికి సమయం ఆసన్నమైంది
- రేపు ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ దళిత, గిరిజన దండోరా
ఇంద్రవెల్లి గడ్డ మీద దండు కట్టి దళిత, గిరిజన దండోరా మోగించబోతున్నామని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ పై పోరాటం చేసేందుకు తెలంగాణ సమాజమంతా కదిలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ ఏడున్నరేళ్ల పాలనలో దళితులు, గిరిజనులకు జరిగిన మోసాలను ఎండగట్టేందుకే ఈ దళిత దండోరా సభను నిర్వహిస్తున్నామని చెప్పారు.
రేపు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. సభను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలంతా అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని చెప్పారు.
రేపు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. సభను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలంతా అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని చెప్పారు.