స్వాతంత్ర్య దినోత్సవం: రైతుల ట్రాక్టర్​ ర్యాలీ హింస నేపథ్యంలో ఎర్రకోట వద్ద కంటెయినర్లతో గోడలు

  • రంగులు వేసి అలంకరిస్తామన్న పోలీసులు
  • ఎలాంటి అవకాశం తీసుకోబోమని వెల్లడి
  • డ్రోన్ దాడి నేపథ్యంలోనూ కట్టుదిట్టమైన బందోబస్త్
స్వాతంత్ర్య దినోత్సవం కోసం ఎర్రకోట వద్ద కేంద్ర ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. గణతంత్ర దినోత్సవం రోజున అక్కడ జరిగిన హింసను దృష్టిలో పెట్టుకుని బందోబస్తును పెంచింది. ఎవరూ ఎర్రకోటలోకి చొరబడడానికి వీలు లేకుండా అడ్డంగా పెద్ద పెద్ద కంటెయినర్లను గోడలుగా ఏర్పాటు చేసింది. భద్రతా కారణాల వల్లే ఈ చర్యలు తీసుకుంటున్నామని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.


గణతంత్ర దినోత్సవం రోజున రైతుల ట్రాక్టర్ ర్యాలీని ప్రస్తావించిన పోలీసులు.. తాము ఎలాంటి అవకాశమూ తీసుకోదలచుకోలేదన్నారు. కంటెయినర్లన్నింటికీ రంగులు వేసి అలంకరణలు చేస్తామని చెప్పారు. జమ్మూ ఎయిర్ బేస్ పై ఇటీవలి డ్రోన్ దాడి నేపథ్యంలోనూ భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఏటా ఇండిపెండెన్స్ డే నాడు ప్రధాని ఎర్రకోట నుంచి ప్రసంగించే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భద్రతను భారీగా పెంచారు.


More Telugu News