హీరో ఎన్టీఆర్ కనుబొమ్మపై గాయం.. వివరణ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ బృందం
- నిన్న ఓ వీడియో విడుదల
- అందులో గుర్తించిన అభిమానులు
- అది నిజమైన గాయం కాదని ఆర్ఆర్ఆర్ టీమ్ వివరణ
రాజమౌళి దర్వకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ సందర్భంగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌కు సంబంధించిన ఓ వీడియోను నిన్న ఆ సినిమా యూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ వీడియోను బాగా పరిశీలించి చూస్తే ఎన్టీఆర్ కను బొమ్మ పైన ఓ గాయం కనపడుతోంది.
ఈ విషయాన్ని గుర్తించిన అభిమానులు ఆయనకు ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది. దీంతో ఆర్ఆర్ఆర్ టీమ్ దీనిపై వివరణ ఇచ్చింది. ఎన్టీఆర్ కను బొమ్మ పైన ఉన్న ఆ గాయం నిజమైంది కాదని, షూటింగ్‌లో భాగంగా పెట్టిందని చెప్పింది. దీంతో అభిమానులకు క్లారిటీ వచ్చింది.
ఈ సినిమాలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తోన్న విషయం తెలిసిందే. వారిద్దరు చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్న ఈ వీడియో అభిమానులను అలరిస్తోంది. కాగా, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తయింది. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ కూడా నటిస్తున్నారు.