అనంతగిరి హిల్స్ పై అడ్వెంచర్ టూరిజం... తెలంగాణ మంత్రులతో మంచు మనోజ్ చర్చలు
- ప్రముఖ పర్యాటక స్థలంగా అనంతగిరి హిల్స్
- అడ్వెంచర్ టూరిజం, వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు
- ప్రభుత్వానికి మనోజ్ ప్రతిపాదనలు
- మంత్రులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం అనంతగిరి హిల్స్ లో అడ్వెంచర్ టూరిజం ప్రాజెక్టుపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ కూడా పాల్గొన్నారు. అడ్వెంచర్ టూరిజం, వెల్ నెస్ సెంటర్ ఏర్పాటుపై మంచు మనోజ్ ప్రతిపాదనలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. తన ప్రతిపాదనలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
ఈ సమావేశంపై మంత్రులు వివరణ ఇచ్చారు. అనంతగిరి హిల్స్ లో ప్రతిపాదిత అడ్వెంచర్స్ టూరిజం ప్రాజెక్టు ఏర్పాటుకు పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా 500 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.