మద్య నిషేధం విషయంలో సీఎం జగన్ పై రఘురామకృష్ణరాజు విమర్శలు
- సీఎంపై రఘురామ విసుర్లు
- పార్టీలో అయోమయం నెలకొందని వెల్లడి
- సీఎంకు మంచి సలహాలు ఇవ్వాలని సూచన
ఏపీలో మద్యనిషేధం అమలు చేస్తామని నాడు సీఎం జగన్ పేర్కొన్న అంశాన్ని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తన మీడియా సమావేశంలో లేవనెత్తారు. మద్యాన్ని నిషేధించనివాడు బుద్ధిలేనివాడని గతంలో సీఎం జగనే అన్నారని, ఇది తామంటున్న మాట కాదని రఘురామ పేర్కొన్నారు. తాము పార్టీ మనుషులమని, పార్టీ అధినాయకుడు ఏంచెబితే అది పాటించేవారమని తెలిపారు. మరి నాయకుడే పాటించకపోతే మేం ఏంచేయాలన్న విషయంలో కొంత అయోమయం నెలకొందని వివరించారు.
ఈ ముఖ్యమంత్రి పార్టీ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుండడంతో పార్టీ మనుగడకే కష్టం వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వెల్లడించారు. అనునిత్యం ఆయనకు దరిద్రపు సలహాలిచ్చే సలహాదారులు ఇకనుంచైనా మంచి సలహాలు ఇవ్వాలని కోరుతున్నామని రఘురామ తెలిపారు.