నాటింగ్ హామ్ టెస్టు: లంచ్ వేళకు 24 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లండ్

  • నాటింగ్ హామ్ లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్
  • రెండో ఇన్నింగ్స్ లో 119-2 రన్స్ చేసిన ఇంగ్లండ్
  • 46 పరుగులకే 2 వికెట్లు డౌన్
  • ఆదుకున్న రూట్, సిబ్లీ
  • సిరాజ్, బుమ్రాకు చెరో వికెట్
నాటింగ్ హామ్ లో భారత్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ స్వల్ప ఆధిక్యం సాధించింది. ఇవాళ ఆటకు నాలుగోరోజు కాగా, ఓవర్ నైట్ స్కోరు 25/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ లంచ్ విరామానికి 2 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 24 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఓ దశలో 46 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టును కెప్టెన్ జో రూట్ (56 బ్యాటింగ్), ఓపెనర్ డామ్ సిబ్లీ (27 బ్యాటింగ్) జోడీ ఆదుకుంది. టీమిండియా బౌలర్లలో సిరాజ్, బుమ్రా చెరో వికెట్ తీశారు. ఈ టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులు చేయగా, భారత్ 278 పరుగులు సాధించింది.


More Telugu News