ఇప్పుడు రూ.24 వేలు మాత్రమే చేతిలోపెట్టి పండగ చేసుకోమంటున్నారు: లోకేశ్ విమర్శలు
- మోసపు నేతలో వైఎస్ జగన్ చేయి తిరిగిన కళాకారుడు
- గతంలో నేతన్నకు ఏడాదికి సుమారు 50 వేలకు పైగా ప్రోత్సాహకాలు
- ఇప్పుడు రాయితీలను ఆపేశారు
- ఆప్కో కొనుగోళ్లు ఆగిపోయాయి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో చేనేత సోదరులకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపణలు గుప్పించారు.
'చేనేత సోదరులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. మోసపు నేతలో వైఎస్ జగన్ చేయి తిరిగిన కళాకారుడు. గతంలో నేతన్నకు ఏడాదికి సుమారు 50 వేలకు పైగా వచ్చే ప్రోత్సాహకాలను, రాయితీలను ఆపేసి... రూ.24 వేలను చేతిలోపెట్టి పండగ చేసుకోమంటున్నారు' అని లోకేశ్ తెలిపారు.
'అది కూడా అందరికీ లేదు.. ఆప్కో కొనుగోళ్లు ఆగిపోయాయి. మజూరీ, రాయితీలు ఆగిపోయాయి. సొంతంగా మగ్గం ఏర్పాటుకు రూ.1.5 లక్షల సబ్సిడీ రుణం ఇమ్మని, ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి నెలకు 10,000 రూపాయలు కరోనా సాయం ఇచ్చి ఆదుకొమ్మని ఈ ముఖ్యమంత్రిని ఎన్నో సార్లు అడిగాను' అని లోకేశ్ చెప్పారు.
'కనీసం ఇప్పటికైనా తెలుగుదేశం డిమాండ్లను జగన్ రెడ్డి పరిశీలించి నేతన్నను ఆదుకోవాలి. ప్రతి నేత కార్మికునికి ‘నేతన్న నేస్తం’ అందించడంతో పాటు అదనంగా గతంలో తెలుగుదేశం ఇచ్చిన ప్రోత్సాహకాలు, రాయితీలు కొనసాగించాలి' అని లోకేశ్ డిమాండ్ చేశారు.