ఇజ్రాయెల్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. రాకెట్ దాడులతో భయానక వాతావరణం

  • లెబనాన్ భూభాగం నుంచి ఇజ్రాయెల్ పైకి 19 రాకెట్ల ప్రయోగం
  • ఇజ్రాయెల్ బలగాలే తమపై తొలుత వైమానిక దాడులు  జరిపాయన్న హెజ్‌బొల్లా సంస్థ
  • తిప్పికొట్టేందుకే రాకెట్లను ప్రయోగించినట్టు వెల్లడి
రాకెట్ దాడులతో ఇజ్రాయెల్ దద్దరిల్లుతోంది. హెజ్‌బొల్లా ఉగ్రవాదులకు, ఇజ్రాయెల్ దళాలకు జరుగుతున్న పోరు తీవ్ర రూపం దాల్చుతోంది. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హెజ్‌బొల్లా ఉగ్రవాదులు నిన్న లెబనాన్ నుంచి 19 రాకెట్లను ఇజ్రాయెల్ భూభాగంపైకి ప్రయోగించారు. ఈ దాడులను తిప్పికొట్టేందుకు ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టింది. ఉగ్రవాదుల రాకెట్ దాడుల్లో తమ పౌరులు ఎవరూ మరణించలేదని ఇజ్రాయెల్ రక్షణ బలగాల అధికార ప్రతినిధి అమ్నాన్ షెఫ్లర్ తెలిపారు. కాగా, ఇజ్రాయెల్ బలగాలే తొలుత తమపై వైమానిక దాడులకు పాల్పడ్డాయని, వాటిని తిప్పికొట్టేందుకు తాము 10 రాకెట్లను ప్రయోగించినట్టు హెజ్‌బొల్లా ఉగ్రవాదులు పేర్కొన్నారు. 


More Telugu News