పులిచింతల మళ్లీ నిండుతుంది... రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: మంత్రి పేర్ని నాని
- కొట్టుకుపోయిన పులిచింతల ప్రాజెక్టు గేటు
- స్పందించిన మంత్రి పేర్ని నాని
- ప్రాజెక్టులో ఇంత నీరు ఎప్పుడూ నిల్వచేయలేదని వెల్లడి
- యాంత్రిక తప్పిదం వల్లే ఘటన జరిగిందని వివరణ
పులిచింతల ప్రాజెక్టులో 16వ నెంబరు గేటు వరద నీటి ఉద్ధృతికి కొట్టుకుపోవడంపై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. పులిచింతల గేటుపై ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు రాష్ట్ర క్యాబినెట్ కు తెలియజేశారని పేర్కొన్నారు. పులిచింతలలో ఇంత నీరు ఎప్పుడూ నిల్వచేయలేదని వెల్లడించారు. యాంత్రిక తప్పిదం వల్ల గేటు విరిగినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు వివరించారు. హైడ్రాలిక్ గేట్ల ఏర్పాటుకు అధ్యయనం చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారని పేర్ని నాని వెల్లడించారు. ఎగువ నుంచి వచ్చే ప్రవాహంతో మళ్లీ పులిచింతల నిండుతుందని, కృష్ణా డెల్టా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన రాజకీయ పరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాషాయ కండువా కప్పుకున్న వ్యక్తి సీఎం కావాలన్నది బీజేపీ ఆశ అని వివరించారు. టీడీపీ, బీజేపీ కుమ్మక్కయ్యే పార్టీలు అని విమర్శించారు. గతంలో మోదీని తిట్టి ఇప్పుడు ప్రేమలేఖలు రాస్తున్నారని వ్యాఖ్యానించారు.