ఏపీలో మరో 2,209 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 81,505 కరోనా పరీక్షలు
- తూర్పు గోదావరిలో 438 కేసులు
- కర్నూలు జిల్లాలో 27 కేసులు
- రాష్ట్రంలో 22 మరణాలు
ఏపీలో గత 24 గంటల్లో 81,505 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,209 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 438 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 382, నెల్లూరు జిల్లాలో 307, కృష్ణా జిల్లాలో 243 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 27 కేసులను గుర్తించారు.
అదే సమయంలో 1,896 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా, 22 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే ఆరుగురు బలయ్యారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 13,490కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,78,350 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,44,267 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 20,593 మందికి చికిత్స జరుగుతోంది.