అలీషాను కొట్టి చంపేశారు... వైసీపీ సర్కారు దాడుల నుంచి మైనారిటీలను రక్షించండి: నారా లోకేశ్
- గుంటూరు జిల్లాలో ఘటన
- మద్యం తరలిస్తున్నాడని కొట్టి చంపారన్న లోకేశ్
- కొట్టి చంపేంత నేరమా? అంటూ ఆగ్రహం
- రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్
గుంటూరు జిల్లా భట్రుపాలెంలో పొరుగు రాష్ట్రం నుంచి మద్యం తరలిస్తున్నారన్న ఆరోపణలతో అలీషా అనే మైనారిటీ యువకుడ్ని పోలీసులు కొట్టి చంపేశారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆరోపించారు. గతంలో నంద్యాలలో చేయని నేరానికి దొంగ అనే ముద్ర వేసి వేధించి అబ్దుల్ సలామ్ కుటుంబాన్ని బలిదీసుకున్న జగన్ ప్రభుత్వం, ఇప్పుడు మరో మైనారిటీ సోదరుడు అలీషాను అన్యాయంగా చంపేసిందని అన్నారు. ఈ ఘటనలో జగన్ రెడ్డి పోలీసుల కర్కశత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని లోకేశ్ తెలిపారు.
అక్రమ మద్యం తరలించడం కొట్టి చంపేంత నేరమా? అని ప్రశ్నించారు. అలాగైతే, విషపూరితమైన సొంత మద్యాన్ని అత్యధిక ధరలకు విక్రయిస్తూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్న జగన్ రెడ్డిది ఇంకెంత పెద్ద నేరమో ఎక్సైజ్ పోలీసులు చెప్పాలని నిలదీశారు. అలీషా హంతకులను ఉద్యోగాల నుంచి తొలగించాలని, అలీషా కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. వైసీపీ సర్కారు దాడుల నుంచి మైనారిటీలను కాపాడాలని స్పష్టం చేశారు.