సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు.. విశాఖలో త్వరలోనే అకాడమీ ప్రారంభిస్తానని వివరణ
- సింధును అభినందించిన జగన్
- విశాఖలో వెంటనే అకాడమీని ప్రారంభించాలని సూచన
- ఏపీ ప్రభుత్వం తరఫున సింధుకు రూ.30 లక్షల నజరానా
- అకాడమీ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం స్థలం కేటాయించిందన్న సింధు
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ రోజు ఉదయం విజయవాడ కనకదుర్గమ్మను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆమె ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కూడా కలిశారు. కాంస్యం సాధించిన సింధును ఈ సందర్భంగా జగన్ అభినందించి, సత్కరించారు.
విశాఖలో వెంటనే అకాడమీని ప్రారంభించాలని ఆమెకు జగన్ సూచించారు. ఏపీ నుంచి మరింత మంది పీవీ సింధులు తయారు కావాలని చెప్పారు. ఏపీ ప్రభుత్వం తరఫున సింధుకు అధికారులు రూ.30 లక్షల నగదు నజరానాను అందజేశారు. వైఎస్ జగన్‌ను కలవడం ఆనందంగా ఉందని పీవీ సింధు చెప్పింది.
ఏపీ సర్కారు క్రీడలను ప్రోత్సహిస్తోందని తెలిపింది. ఉద్యోగాలలో క్రీడలకు 2 శాతం రిజర్వేషన్ ఇవ్వడం మంచి నిర్ణయమని పేర్కొంది. అకాడమీ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం స్థలం కేటాయించిందని, తాను త్వరలోనే అకాడమీ ప్రారంభిస్తానని సింధు వివరించింది.