'మహాసముద్రం' నుంచి 'హే రంభ' సాంగ్ రిలీజ్!

  • అజయ్ భూపతి నుంచి 'మహా సముద్రం''
  • యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే కథ
  • చైతన్ భరద్వాజ్ సంగీతం
  • రంభను గుర్తుకు తెచ్చే స్పెషల్ సాంగ్  
అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహాసముద్రం' సినిమా రూపొందింది. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాలో, శర్వానంద్ .. సిద్ధార్థ్ .. అదితీ రావు .. అనూ ఇమ్మాన్యుయేల్ .. జగపతిబాబు ప్రధానమైన పాత్రలను పోషించారు. ఇటీవలే ఈ  సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం 'హే రంభ' అంటూ సాగే లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. 90వ దశకంలో గ్లామరస్ హీరోయిన్ గా రంభ ఒక ఊపు ఊపేసింది. ఈ సినిమాలో కథా పరంగా జగపతిబాబు .. శర్వానంద్ తదితరులు మాస్ ఏరియాలో ఉంటూ ఉంటారు .. వాళ్లంతా రంభ అభిమానులు. ఫుల్లుగా తాగేసి ఆమె అందచందాలపై పాడుకునే పాట ఇది.

చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకు, భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించాడు. జానీ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేశారు. ఇది కేవలం మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రాసిన పాట .. తీసిన పాట. జగపతిబాబుతో చాలా రోజుల తరువాత స్టెప్పులు వేయించిన పాట. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు. 



More Telugu News