సూదిని మింగిన యువ‌కుడు.. ఊపిరితిత్తుల్లోంచి అత్యాధునిక పరికరాలతో తీసిన వైద్యులు!

  • పశువులకు వాడే సూదిని నోట్లో పెట్టుకున్న యువ‌కుడు
  • ఒక్క‌సారిగా గొంతులోకి జారిపోయిన సూది  
  • కర్నూలులోని సత్యసాయి ఈఎన్‌టీ ఆసుప‌త్రిలో చికిత్స‌
  • టెలిస్కోపిక్‌ బ్రాంకోస్కోప్‌ ద్వారా సూదిని బయటకు తీసిన వైద్యులు  
ఓ యువకుడు సరదాకి సూదిని నోట్లో పెట్టుకుంటే, అది కాస్తా అతని గొంతులోకి జారిపోయి, ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయింది. కర్నూలులోని సత్యసాయి ఈఎన్‌టీ ఆసుప‌త్రి వైద్యులు అత్యాధునిక వైద్య పరిక‌రాల‌తో సూదిని తొల‌గించి ఆ యువ‌కుడి ప్రాణాలు కాపాడారు.

వివ‌రాల్లోకి వెళ్తే, తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా అనంతపురం గ్రామానికి చెందిన పరశురాముడు అనే యువ‌కుడు పశువులకు వాడే సూదిని సరదాగా నోట్లో పెట్టుకున్నాడు. అయితే, అది ఒక్క‌సారిగా గొంతులోకి జారి.. ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయింది. దీంతో అతను గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, విపరీతమైన దగ్గుతో బాధ‌ప‌డ్డాడు.

వెంట‌నే అత‌డిని కుటుంబ స‌భ్యులు కర్నూలులోని సత్యసాయి ఈఎన్‌టీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వైద్య ప‌రీక్ష‌లు చేసిన డాక్ట‌ర్లు అత్యాధునిక టెలిస్కోపిక్‌ బ్రాంకోస్కోప్‌ ద్వారా ఆ సూదిని బయటకు తీశారు. ఎంతో క్లిష్టమైన ప‌ద్ధ‌తి ద్వారా ఆ సూదిని తొల‌గించామ‌ని చెప్పారు.


More Telugu News