తెలంగాణ ప్రజల హృదయాల్లో జయశంకర్ ఎప్పటికీ నిలిచే ఉంటారు: సీఎం కేసీఆర్
- శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి
- జయశంకర్ ను కీర్తించిన సీఎం కేసీఆర్
- ఉద్యమం కోసం జీవితాన్ని అర్పించారని కితాబు
- బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్నట్టు వెల్లడి
ఈ నెల 6న ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ తన ఉద్యమ సహచరుడ్ని స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో ప్రొఫెసర్ జయశంకర్ చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం, ఉద్యమ భావజాల ప్రసరణ కోసం తన జీవితాన్నే అర్పించిన మహనీయుడు జయశంకర్ అని కీర్తించారు.
జయశంకర్ కలలుగన్న తెలంగాణ కోసమే తాము పనిచేస్తున్నామని, ఆయన ఆశయాలను వరుసగా నెరవేర్చుతున్నామని చెప్పుకొచ్చారు. సబ్బండ వర్గాల సమగ్రాభివృద్ధి కోసమే ప్రత్యేక తెలంగాణ అని చాటిన వ్యక్తి జయశంకర్ అని కొనియాడారు. ఈ దిశగా బంగారు తెలంగాణ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు.