రేపు తిరుమలలో సమావేశం కానున్న స్పెసిఫైడ్ అథారిటీ
- ముగిసిన టీటీడీ బోర్డు పదవీకాలం
- ఇద్దరు సభ్యులతో స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు
- సభ్యులుగా టీటీడీ ఈవో, అదనపు ఈవో
- రేపు ఉదయం 11 గంటలకు అన్నమయ్య భవన్ లో భేటీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఇద్దరు సభ్యుల స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేయడం తెలిసిందే. పాలనా వ్యవహారాల కోసం స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటైంది. ఈ స్పెసిఫైడ్ అథారిటీలో టీటీడీ ఈఓ, అదనపు ఈవో సభ్యులుగా ఉంటారు. తిరుమలలో రేపు స్పెసిఫైడ్ అథారిటీ సమావేశం కానుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు అన్నమయ్య భవన్ లో జరిగే ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించనున్నారు.